Story Time...
We have started with the story of a great mystic ... Acharya Nagarjuna. (May 2018).
For June 2018, here are 2 parts. One, a story narrated by a DOCTOR. Story two can be found at the end..
For JULY 2018, a little story in telugu.
హద్దు లేని ఆశ
-------------------
ఒకడికి డబ్బు అవసరం వచ్చి అటు ఇటు తిరుగుతున్నాడు..
అది గమనించిన వేరే వ్యక్తి అతన్ని ఆపి,
ఒక పరిక్ష పెట్టాడు. . .
'' నువ్వు ఈ ఎండలో ఆ బండ మీద 10 నిమిషాలు నిలబడితే 1000 ఇస్తా అన్నాడు కనిపించే ఒక బండను చూపిస్తూ..
అవతలి వ్యక్తికి డబ్బు అవసరం గనుక కాళ్ళు కాలుతున్నా సరే అలానే నిలబడ్డాడు. .
వాడు ఈ సారి 5 నిమిషాలకే 1000 ఇస్తా నిలబడమన్నాడు..
వాడు సరే అని కాళ్ళు ఎర్రగా కందిపోతున్నా అలానే నిలుచున్నాడు. .
ఈ సారి వాడు 1 నిమిషానికి 1000 అన్నాడు..
అప్పటికే అవసరమైనంత డబ్బు వచ్చేసింది, పైగ స్పృహకోల్పోడానికి సిద్దంగా ఉన్నాడు అయినా సరే డబ్బు మీదా ఆశతో బలవంతంగా అలానే నిలుచున్నాడు. .
చివరిగా ఈ సారి సెకనుకి 100000 అన్నాడు..
ఒంట్లో శక్తినంతా కూడదీసుకొని నిలబడటానికి ప్రయత్నించి ఆ ఎండ తీవ్రతకు తట్టుకోలేక చచ్చిపోయాడు. . !
.
అవసరానికి, ఆశకి మధ్య కంటికి కనిపించేంత చిన్న దారం ఒకటి ఉం
టుంది., ఆ దారాన్ని మనం సరిగ్గా చూసుకోకుండా దాటామో. .?
మనల్ని ఇంకెవరో చూసుకోవల్సిన పరిస్ధితి వస్తుంది. . .!
.
ఒక ముద్దకు మించి మనం నోరు తెరవలేం. .
పాదాలు సాగినంత వరకే మన అడుగులు వేయగలం. .
అలాంటిది మన ఆశను మాత్రం హద్దు ఎందుకు దాటనివ్వాలి. . ?
హద్దు లేని ఆశ, తెడ్డు లేని పడవ కుదురుగా ఉండలేవు...
ఏదో రోజు మనల్ని ముంచేస్తాయి. . .!!